రష్మిక మందన ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ టీజర్ విడుదలైంది. మారుమూల గిరిజన గ్రామాలలో అణచివేత, దోపిడీకి గురయిన గిరిజన మహిళ తిరగబడి పోరాటాలు మొదలుపెడితే ఏమవుతుందనేదే ఈ ‘మైసా’ సినిమా కథ.. అని టీజర్‌లో మరోసారి స్పష్టం చేశారు.
రష్మిక మందన అంటే 'నేషనల్ క్రష్' మాత్రమే కాదు ఓ 'పెర్ఫెక్షనిస్ట్' కూడా. కనుక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం కఠోర శిక్షణ తీసుకొని మరీ చేశారు. టీజర్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 27న మైసా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.