రామ్‌ చరణ్‌-సుకుమార్ సినిమాకి నేడే పూజా కార్యక్రమం

November 01, 2026


img

రామ్‌ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సి-17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాకు నేడు (నవంబర్‌ 1) ఉదయం 10.50 గంటలకు పూజా కార్యక్రమం జరుగబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ విషయం తెలియజేస్తూ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్ పెట్టింది. దానిలో ఓ పక్క పొడవాటి జుట్టును మాత్రమే చూపుతూ పక్కనే పూజా కార్యక్రమం వివరాలు పేర్కొంది. పూజా కార్యక్రమం పోస్టర్లో ఆ జుట్టు ఏమిటి? ఆ పొడవైన జుట్టు హీరోదా లేక హీరోయిన్‌దా?ఈ పోస్టర్లో ఎందుకు పెట్టారు? అనే సందేహాలు కలిగేలా చేస్తూ తొలి పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచారు. 

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్, టీ సిరీస్ కలిసి నిర్మించబోతున్నాయి. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి నటించబోతున్నట్లు సమాచారం. నేడు పూజా కార్యక్రమంలో హీరోయిన్‌ విషయంలో కూడా స్పష్టత వస్తుంది.                        


Related Post

సినిమా స‌మీక్ష