‘హనుమాన్’ సినిమాతో సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ నుంచి భారీ అంచనాలతో ‘మహాకాళి’ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ‘శుక్రాచార్య వార్ క్రై’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు.
రాక్షస గురువు శుక్రాచార్యుడు (బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా) అసురజాతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు తపః శక్తితో పాతాళ లోకంలో బందించబడిన రాక్షసులకు విముక్తి కల్పించి, మానవజాతిని అంతం చేయాలనుకుంటాడు.
అప్పుడు ఒడిలో ఉన్న బిడ్డని నిమురుతున్న అమ్మవారు ఉగ్రరూపం దాల్చినట్లు వీడియోలో చూపారు.
ఈ వీడియో చూసినప్పుడు హనుమాన్ సినిమా కంటే మహాకాళి ఇంకా చాలా అద్భుతంగా ఉండబోతోందని స్పష్టమవుతుంది.
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, భూమి శెట్టి, రోహిత్ శరఫ్, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్రఖని, రజత్ కపూర్, జితిన్ గులాటి, మురళీ శర్మ, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
మహాకాళికి కథ, స్క్రీన్‌ప్లే: ప్రశాంత్ వర్మ, స్నేహ సమీరా, సంగీతం: స్మరణ్ సాయి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటింగ్: హర్ష వర్ధన్ దన్నాసి చేస్తున్నారు.
ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మహాకాళి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.