ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మళ్ళీ ఫైరింగ్ షురూ!

November 03, 2026


img

మంత్రి పదవి లభించక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఓ రెండు నెలలు కాస్త మౌనంగా ఉన్నారు. మళ్ళీ సొంత ప్రభుత్వం, మంత్రులపై ఫైరింగ్ మొదలుపెట్టారు. 

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ, “మునుగోడు నియోజకవర్గానికి ఓ 200-300 కోట్లు కేటాయిస్తే చుట్టుపక్కల చెరువులు, కుంటలు అన్నీ పూడిక తీసి నీళ్ళు నింపుకుంటామని నేను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.

మొత్తం నిధులన్నీ కోదాడ,హుజూర్ నగర్‌లోనే ఖర్చు చేస్తున్నాడు. ఈ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ నీటిపారుదల శాఖకు మంత్రా లేక హుజూర్ నగర్‌కు మాత్రమే మంత్రా? ఇదివరకు బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువుల్లో పూడిక తీశారు. వాటిలో నిలిచిన వర్షం నీళ్ళే ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేనైన నేను నా నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను,” అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 

ఈవిధంగా బహిరంగ వేదికలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను విమర్శిస్తే సహించబోమని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ పలుమార్లు హెచ్చరించింది. ఈవిధంగా మాట్లాడినందుకే మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి ఊడింది. అయినా తగ్గేదేలే అంటున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి క్రమశిక్షణ కమిటీ ఏవిధంగా స్పందిస్తుందో?

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">బీఆర్ఎస్ వాళ్ళు పూడిక తీసిన చెరువుల్లో నీళ్ళు నిలిచి ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయి నిధులన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతున్నాడు నేను సీఎం, మంత్రి కాకపోవచ్చు కానీ గుణంలో వాళ్లకంటే వంద రెట్లు గొప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మంత్రి అయ్యా ఆయన హుజూర్ నగర్‌కు మంత్రా లేదా తెలంగాణకు మంత్రా? మొత్తం నిధులన్నీ కోదాడ, హుజూర్ నగర్‌కే తీసుకుపోతున్నాడు అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా నిధులు అడగాల్సి వస్తుంది - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి</p>&mdash; Telugu Scribe (@TeluguScribe) <a href="https://x.com/TeluguScribe/status/2117453633449083145?ref_src=twsrc%5Etfw">November 3, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Video Source: Telugu Scribe

Related Post