ఓ మైసా రే... లిరికల్ రష్మిక ఉగ్రరూపం!

November 03, 2026


img

రష్మిక మందన ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ నుంచి ఓ మైసా రే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. కత్తి పట్టి రష్మిక చేసిన రౌద్ర నృత్యం చూస్తున్నప్పుడు ఈమె మన నేషనల్ క్రష్  రష్మిక మందనేనా? అని సందేహం కలుగుతుంది. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడిన గిరిజన మహిళ మైసాను మహిషాసురమర్ధినిగా ఈ పాటలో చూపారు. 

సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా సింధుజా శ్రీనివాసన్, బృందం ఈ పాట ఆలపించారు.   

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.  

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 27న మైసా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష