గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు

November 03, 2026


img

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు గడువు పొడిగించారు. నవంబర్ 6తో ఓటరు నమోదు గడువు ముగుస్తుంది. కానీ గత రెండు రోజులుగా ఈసీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్‌లైన్ ఓటరు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో అర్హులైన పట్టభద్రులు, ఎమ్మెల్సీలుగా నామినేషన్స్‌ వేయబోతున్న అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. 

ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అర్హులైన పట్టభద్రులు గడువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుదర్శన్ రెడ్డి తెలిపారు. పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి, దరఖాస్తు సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసి తుది జాబితా ప్రకటించిన తర్వాత, ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేస్తుంది. 


Related Post