మురాసు తుపాను: తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన

November 03, 2026
img

బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. 

నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

అలాగే సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

మురాసు తుపాను నవంబర్ 3న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Post