ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు నెల్లూరు, చిత్తూరు వరకు కూటమి ఘన విజయం సాధించింది. ఏపీలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లు, మేయర్ పదవులు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, చైర్మన్ పదవులలో అత్యధిక శాతం కూటమి పార్టీలే దక్కించుకున్నాయి.
ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసి ఉన్నప్పటికీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించడం వలన వైసీపీ మరింత దారుణంగా ఓటమి పాలయింది.
ఈ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో టీడీపి-జనసేనల మద్య రచ్చరచ్చ జరిగినా, వాటి అధినేతలు సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఐకమత్యంగా ఉంటూ గట్టిగా నిలబడినందునే కూటమి ఇంత ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు.
ఈ ఘనవిజయంతో కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపి, జనసేనలు, వాటి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయగా, 2029 శాసనసభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని, ‘జగన్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎదురు దెబ్బే!