లిటిల్ హార్ట్స్’ సినిమాతో పరిచయమైనా యువ నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ చేసిన తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’ త్వరలో విడుదల కాబోతోంది. అయితే సినిమా టైటిల్‌పై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం చెప్పడంతో దానిని కుదించి ఇంగ్లీషులో ‘డీఎన్‌కే’గా మార్చారు. కనుక ఇక నుంచి ఈ సినిమాను ‘డీఎన్‌కే’గానే ప్రమోషన్స్ నిర్వహించి విడుదల చేస్తారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా సుష్మిత శెట్టి నటించగా, సీనియర్ నటుడు అలీ తండ్రి పాత్రలో కనిపిస్తారు. రఘుబాబు, రాజిత, ప్రియా, బబ్లూ, నంద గోపాల్, భద్రం, గుండు సుదర్శన్, రమణ భార్గవ అలీ, రఘుబాబు, రాజిత, ప్రియా, బబ్లూ, నంద గోపాల్, భద్రం, గుండు సుదర్శన్, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: శ్రీను కంబాల, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, కెమెరా: సూర్య బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, అనిల్ యెర్నేని కలిసి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కాబోతోంది.