అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి టబుని మహంతి ఝాన్సీరాణిగా పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా, ‘డబ్బు అది ఇచ్చే గుర్తింపు.. దానిని నిలబెట్టుకునేందుకు సాగే పరుగు’ అంటూ ఇదివరకే ఫస్ట్ గ్లిమ్స్‌లో చెప్పేశారు. తాజా వీడియోలో మహంతి ఝాన్సీరాణి హార్డ్ వర్క్, లక్ గురించి చెప్పిన డైలాగులు, ముఖ్యంగా మహంతి ఝాన్సీరాణి అనే నేను.. అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చూపారు.
ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సుష్మిత భట్ నటిస్తుండగా, టబు, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కథ, దర్శకత్వం: రా. కార్తీక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రాజా మహాదేవన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
అన్నపూర్ణా స్టూడియోస్ అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించి నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.