సింగరేణి కార్మికులకు ఇటీవలే దసరా బోనస్ లభించింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా కోలిండియా తరహాలోనే సింగరేణి అధికారులకు కూడా వేతనాలు పెంచుతూ సంస్థ డైరెక్టర్ గౌతమ్ పొట్రు ప్రకటించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సింగరేణిలోని ఈ-1 నుంచి ఈ-7 గ్రేడ్ల వరకు సుమారు 1,800 మంది అధికారులకు జీతాలు పెరుగనున్నాయి.
కోలిండియా అనుసరిస్తున్న విధానాన్నే సింగరేణిలో కూడా అమలు చేయాలని ఆ సంస్థ అధికారుల సంఘం ఇదివరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరింది. వారి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన అయన ఆదేశాల మేరకు సింగరేణి బోర్డు 585వ సమావేశంలో ఈ వేతన సవరణకు ఆమోదం లభించింది.
సవరించిన వేతనాలు ఈవిధంగా ఉన్నాయి.