దసరాకు పోస్టర్ల సందడే సందడి

October 21, 2026


img

ఈసారి దసరా పండుగకు ఊహించినట్లే అనేక సినిమాల కొత్త పోస్టర్స్, టైటిల్‌ పోస్టర్స్ విడుదలయ్యాయి. 

వాటిలో శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌, మానస వారణాశి జంటగా చేస్తున్న ‘జార్జ్ క్రిష్’, కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న‘వృషకర్మ’ పోస్టర్స్ ఉన్నాయి. 

మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వం నితిన్‌, హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఆఫియా సయ్యద్‌ల అలియాస్ రుక్మిణీ, కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో దేవికా భట్‌ హీరోయిన్‌గా చేస్తున్న రియాలిటీ సినిమా పోస్టర్స్ కూడా చాలా ఆకట్టుకున్నాయి.

అలాగే ఏపీ, తెలంగాణల మద్య చిన్నపాటి వివాదం రాజేసిన ‘ఇడుపు కాయితం’ పోస్టర్‌ కూడా ఆకట్టుకుంటుంది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి, నాగదుర్గని (కొత్త హీరోయిన్‌) జంటగా నటిస్తున్నారు. అలాగే ఆనంద్ కే దర్శకత్వంలో సునీల్ తొలిసారిగా న్యాయవాదిగా నటిస్తున్న ‘డ్యూ డేట్’, లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, సంయుక్త జంటగా నటిస్తున్న ‘హైందవ’ పోస్టర్స్ విజయ దశమి నాడు విడుదలయ్యాయి. 

ఇంకా హాయ్, ఆ, గరివిడి లక్ష్మి, హరీష్ రావు విజేత తదితర సినిమా పోస్టర్స్ అన్నీ ఒకే రోజున నిన్న విడుదలయ్యాయి. 


Related Post

సినిమా స‌మీక్ష