నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం నవంబర్ 5న దీపావళి పండుగనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
నిన్న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడుగా నటిస్తున్న యష్ ‘శివతాండవం’ చేస్తున్న వీడియో అది. దానిలో యష్ చాలా అద్భుతంగా శివతాండవం చేశారు.
అయితే వేలకోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాను ప్రతీ పాత్రకు అతిగా చేసిన హైప్స్, మితిమీరిన గ్రాఫిక్స్ దెబ్బ తీయకుండా ఉంటే చాలని శివతాండవం చూసినప్పుడే అనిపిస్తుంది.
రామాయణలో దశరథుడిగా అరుణ్ గోవిల్, రవీ దుబే లక్ష్మణుడుగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, మండోదరిగా కాజల్ అగర్వాల్, రావణుడుగా కన్నడ నటుడు యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది.
ఈ ఏడాది దీపావళి (నవంబర్ 5)న రామాయణ మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కాబోతోంది.