ఆదర్శ కుటుంబం నుంచి మరో క్రేజీ సాంగ్‌

October 20, 2026


img

 త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకటేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ నుంచి నారాయణమ్మ పాత తర్వాత మరో క్రేజీ సాంగ్‌ విడుదలైంది. 

రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు తమన్ సంగీతం సమకూర్చి ధనుంజయ్, రైనా రెడ్డిలతో కలిసి హుషారుగా పాడారు. 

ఈ క్రైమ్-ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి, యువినా పార్ధవిల ‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్, రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష