శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదలైంది. కానీ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడీ సినిమా తెలుగుతో సహా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 22 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో నాని, కయాదు లోహార్ జంటగా చేయగా మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో నానితో కలిసి డాన్స్ చేశారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.