కిరణ్-దేవిక ఫస్ట్ లుక్ రియాలిటీ పోస్టర్‌

October 17, 2026


img

కిరణ్‌ అబ్బవరం సొంతంగా వ్రాసుకున్న కథతో స్వీయ దర్శకత్వంలో హీరో నటిస్తున్న సినిమా పేరు ‘రియాలిటీ.’  ఈ సినిమాలో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడుగా నటిస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లోనే చూపారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా దేవికా భట్‌ నటిస్తున్నారు. వారిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ నేడు విడుదల చేశారు. ఇద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నట్లున్నారు. 

ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేస్తున్నారు. 

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. 



Related Post

సినిమా స‌మీక్ష