అక్టోబర్‌ 18న కల్ట్ ట్రైలర్‌, 30న సినిమా.. పక్కా!

October 17, 2026


img

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘కల్ట్’ వాయిదా పడిందంటూ వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది చిత్ర బృందం. అక్టోబర్ 18న ‘కల్ట్’ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.అలాగే ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్ 30న సినిమా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. 

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కార్తికేయ, అనిరుధ్‌ భాస్కర్‌, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్‌ భారతీయ, విశాఖ్‌ నాయర్‌, చేవూరి వివేక్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

విశ్వక్‌ సేన్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్ట్‌’ సినిమాకు డైలాగ్స్‌: తరుణ్‌ భాస్కర్‌; సంగీతం: రవి బస్రూర్‌; సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌; స్టంట్స్‌: కరుణాకర్‌, జాషువా; ఆర్ట్‌: అరవింద్‌ మూలే; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల.

తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్‌ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష