యువ హీరో హర్షిత్ రెడ్డి, విశాక ధీమన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రోమియో జూలియట్’ అక్టోబర్ 23న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
భార్గవ మాచర్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిరి హనుమంతు, ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఇప్పటి సమాజంలో ప్రేమలు బంధాలు ఏవిధంగా ఉన్నాయో చూపుతూ తీసిన ఈ సినిమా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని భార్గవ మాచర్ల చెప్పారు.
ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్, ఎడిటింగ్: యువకిరణ్ చేశారు.
నవరస ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతోంది.