సునీల్.. డ్యూ డేట్

October 15, 2026


img

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. తొలిసారిగా సునీల్  ‘డ్యూ డేట్’ అనే సినిమాలో ‘శేఖర్ చంద్ర’ అనే న్యాయవాదిగా నటిస్తున్నారు. 

ఆనంద్ కె దర్శకత్వంలో లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. దీనిలో సునీల్ కూడా పాల్గొంటున్నారు. 

ప్రముఖ హాస్య నటుడు కృష్ణ భగవాన్ చాలా కాలం విరామం తర్వాత ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, అక్షర గౌడ తదితరులు ఇందులో నటిస్తున్నారు.

ప్రస్తుత సమాజంలో ఒక తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్న ఓ అంశం ఆధారంగా ఈ కోర్టు డ్రామాను రూపొందిస్తున్నారు. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపారు. 


Related Post

సినిమా స‌మీక్ష