రణబాలి రన్ టైమ్‌.. మూడు గంటలా!

October 15, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలుగా నటించిన ‘రణబాలి’ చాలా భారీ అంచనాలతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హింస, రక్తపాతం ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా రన్ టైమ్‌ 2 గంటల 58 నిమిషాల 27 సెకన్లు. అంటే దాదాపు మూడు గంటలన్న మాట. చారిత్రిక నేపధ్యంతో రాయలసీమ యాసలో తీసిన రణబాలి, అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలడా లేదా అనేది మరికొన్ని గంటలలో తెలుస్తుంది.   

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ‘రణబాలి’లో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటించగా, మైమ్ మధు, జేసన్ షా, ఈశ్వరీ రావు, వినోద్ సాగర్, లూక్ మెక్‌గిబ్నీ, రాబర్ట్ ముల్థస్, బ్లాదిమిర్ ఏంజెలోవ్, జాచరీ కొఫిన్, బెనెడిక్ట్ గారెట్, జెఫ్రీ గిలియానో, ఆర్తుర్ సోరోకిన్ ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేశారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి రణబాలిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అక్టోబర్‌ 16న విడుదల చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష