త్వరలో రామ్ చరణ్‌-సుకుమార్‌ సినిమా షూరూ?

October 15, 2026


img

పెద్ది రిలీజ్‌ అయ్యి అప్పుడే నాలుగున్నర నెలలు. కానీ ఇంతవరకు రామ్‌ చరణ్‌ కొత్త సినిమా మొదలుపెట్టలేదు.    సుకుమార్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సీ-17’ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుకుమార్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు అక్కడే మొదలుపెట్టినట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. 

రామ్ చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌ వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ కాగా, ఆ తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప-1,2 కూడా సూపర్ హిట్ అయ్యాయి. కనుక సుకుమార్‌తో రామ్‌ చరణ్‌ చేయబోయే ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు కూడా వీరి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

విజయదశమి రోజున సుకుమార్ కొత్త కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ‘ఆర్‌సీ-17’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ సినిమాలో హీరోయిన్‌, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష