కేటీఆర్‌ 188 కోట్లతో పేపర్ కొన్నారు: కల్వకుంట్ల కవిత

October 15, 2026


img

కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై ఇంకా రాష్ట్రంలో చర్చ జరుగుతుండగానే, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోదరి, టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కొత్త విషయం బయట పెట్టారు. 

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నిన్నగాక మొన్న కేటీఆర్‌ రూ.188 కోట్లు ఖర్చు చేసి ‘ది పయోనీర్’ ఇంగ్లీషు పత్రికను కొనుగోలు చేశారు. వారికి బాగా డబ్బుంది కనుక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగగలరు. కానీ మాకు అంత లేదు కనుక నేలపై కార్లలోనే తిరుగుతున్నాము. 

ఇంతకాలం ఇక్కడ సొంత పత్రికతో అబద్దాలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీషు పత్రిక కూడా కొనుగోలు చేసి దాంతో ఇంగ్లీషులో కూడా అబద్దాలు ప్రచారం చేయబోతున్నారు. పయోనీర్ పత్రిక బీఆర్ఎస్‌ పార్టీ పత్రికగా మారింది కనుక ఇకపై దానిలో వచ్చే వార్తలను నమ్మవద్దు,” అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">180 కోట్ల రూపాయల Tillu గాని కరపత్రం The Pioneer లో ప్రజా ప్రభుత్వం పై రోత రాతలు . Note - Madhucon Projects కామ నాగేశ్వర్ రావు కి పొడుగు కాళ్ళు అంటే చాలా ఇష్టం https://t.co/A1p8NQm2bA</p>&mdash; Pulse of Telangana (@pulseoftelangan) <a href="https://x.com/pulseoftelangan/status/2110573775544881438?ref_src=twsrc%5Etfw">October 15, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>


Related Post