అనుపమపై క్రష్: కాసర్ల శ్యామ్

October 15, 2026


img

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కల్యాణం’ ప్రీ రిలీజ్ వేడుకను ‘క్రేజీ కల్యాణం బరాత్’ పేరుతో నిర్వహించారు. దీనిలో ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ చెప్పిన మాట విని అందరూ మొదట షాక్ అయినప్పటికీ తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.  

అందరిలాగే నాకూ మీరంటే క్రష్. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నాను. మిమ్మల్ని నేను ఎంతో ఆరాధిస్తాను. ఇప్పుడు మీ వీరాభిమానిగా మారిపోయాను. మిమ్మల్ని ‘అఆ’ అని పిలుస్తా. ‘అ’ అంటే నుపమ, ‘ఆ’ అంటే ఆరాధన,” అని కాసర్ల శ్యామ్‌ వివరించారు. 

బద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో నరేశ్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ముఖ్యపాత్రలు చేశారు. బూసం జగన్‌ రెడ్డి సొంత బ్యానర్‌పై యారోస్ సినిమాస్‌తో కలిసి నిర్మించిన క్రేజీ కల్యాణం అక్టోబర్ 16న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష