అక్టోబర్‌ 17న ఆకాశంలో ఒక తార టీజర్‌

October 15, 2026


img

పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్‌ హీరోగా చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ నెల 17న టీజర్‌, నవంబర్‌ 20న సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలో ‘కృష్ణ ప్రతీ అమ్మాయికి బాగా నచ్చేస్తాడు. బాగా కనెక్ట్ అవుతాడు,’ అంటూ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే ఓ గ్రామీణ యువతి కథలో మన హీరో పాత్ర ఏమిటో సినిమాలో చూడాల్సిందే.    

 సాత్విక వీరవల్లి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటి శ్రుతీ హాసన్ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.  

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: గంగరాజు గుణ్ణం, కథ, దర్శకత్వం: పరవన్ సాదినేని, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: సుజీత్ సారంగ్, ఆర్ట్: వంశీ కృష్ణ; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు. 

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా,  లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమా నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 20న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష