‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న‘వృషకర్మ’ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని మొదట ప్రయత్నించినప్పటికీ గ్రాఫిక్ పనులు ఆలస్యమవడంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.