ప్రముఖ నటి, ఏపీ మాజీ మంత్రి రోజా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆమె రాజకీయాలలో బిజీగా ఉండటంతో సినిమాలు, టీవీ షోలు మానుకున్నారు. కానీ ఇటీవల ఆమె ‘లెనిన్ పాండియన్’ అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్లో నటించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజులు పూర్తికాకముందే శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
డీడీ బాలచంద్రన్ దర్శకత్వంలో రోజా, దర్శన్ గణేశన్ ప్రధాన పాత్రలు చేయగా, గంగై అమరన్, జార్జ్ మరియన్, ఆడుకాలం నరేన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్, ఒక రైతు, ఇసుక అక్రమ తవ్వకాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తుల జీవితాలను ఈ సినిమాలో చూపారు. ఈ సినిమాలో రోజా నటన అద్భుతంగా ఉంది. ఇప్పుడీ సినిమా (తెలుగు వెర్షన్) ఓటీటీలోకి వచ్చేసింది కనుక ఆమె అభిమానులు చూసి ఆనందించవచ్చు.