జైలర్ ఎంత వసూలు చేశాడంటే...

October 16, 2026


img

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ సినిమా భారీ వసూళ్లతో శుభారంభం చేసింది. అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. 

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విమర్శకులు పెదవి విరిచినా అభిమానులు మాత్రం రజినీకాంత్‌ని చూసి జైలర్‌కు కనకవర్షం కురిపించారు. భారత్‌లో తొలిరోజు జైలర్ రూ.70.25 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టగా, వాటిలో నికర వసూళ్లు రూ.59.70 కోట్లుగా నమోదయ్యాయి. 

విదేశాల్లో మరో రూ.55 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఊహించినట్లే తమిళ వెర్షన్‌ అత్యధికంగా రూ.43.35 కోట్ల నికర వసూళ్లు సాధించగా, జైలర్ తెలుగు వెర్షన్‌ రూ.12.50 కోట్లు, హిందీ వెర్షన్‌ రూ.3.50 కోట్లు, కన్నడ వెర్షన్‌ కేవలం రూ.35 లక్షల వసూళ్లు సాధించింది. 

అయితే నేడు జైలర్‌తో పోటీకి రణబాలి రంగంలో దిగుతున్నాడు. కనుక రణబాలి, జైలర్.. రెండు సినిమాలలో ఏది నిలదొక్కుకుంటుంది? ఏది ఎక్కువ కలెక్షన్స్‌ సాధిస్తుందనేది త్వరలో తెలుస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష