అంతుపట్టని ప్రపంచంలోకి అది సాయి కుమార్‌ కూడా!

October 16, 2026


img

టాలీవుడ్‌లో ఒక్కో సమయంలో ఒక్కో జోనర్‌లో వరుసపెట్టి సినిమాలు వస్తుంటాయి. ప్రస్తుతం చారిత్రిక, మంత్ర తంత్ర క్షుద్రశక్తుల నేపధ్యంలో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. కనుక యువ హీరో అది సాయికుమార్ కూడా అటువంటి అంతుపట్టని ప్రపంచంలోకి పయనిస్తున్నారు. త్రిశూల్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం:3గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఈ నెల 20న విడుదల కాబోతోందని తెలియజేస్తూ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. 

నవరాసన్ సమర్పణలో ప్రశాంత్, రుద్రప్ప కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బి. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.      


Related Post

సినిమా స‌మీక్ష