పవన్ సాదినేని దర్శకత్వంలో సల్మాన్ దుల్కర్ ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ నేడు విడుదలైంది. నేటికీ మన దేశంలో గ్రామాలలో ఆడపిల్లల చదువులు పెళ్ళి వరకే అన్నట్లు సాగుతుంటాయి. కానీ కొందరు ఆడపిల్లలు మాత్రం గొప్ప గొప్ప కలలు కంటూ వాటిని నిజం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.
వారికి కృష్ణలా వెనకుండి ప్రోత్సహించి సాయపడేవారు దొరికితే నాసా వంటి అంతరిక్ష కేంద్రాల వరకు పోగలరని నిరూపించే సినిమాయే ఆకాశంలో ఒక తార. టీజర్లో సినిమా కథ చెప్పేశారు. ఇక సినిమా ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే, నవంబర్ 20న థియేటర్లలో విడుదలైనప్పుడు చూడాల్సిందే.
ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటి శ్రుతీ హాసన్ కూడా దీనిలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: గంగరాజు గుణ్ణం, కథ, దర్శకత్వం: పరవన్ సాదినేని, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సుజీత్ సారంగ్, ఆర్ట్: వంశీ కృష్ణ; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా, లైట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమా నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న విడుదల కాబోతోంది.