సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్యా మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వచ్చే నెల (నవంబర్)లో వీరి వివాహం జరగనున్నట్లు తమిళ మీడియా పేర్కొంటోంది. వాటి ప్రకారం గ్రీస్ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.
కావ్యా మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తె. వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆమె ఉన్నత విద్యను అభ్యసించి, ప్రస్తుతం క్రికెట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తూ జట్టు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లలో ఆమె జట్టు ద్వారా ఆమె మరింత గుర్తింపు పొందారు.
మరోవైపు అనిరుధ్ రవిచందర్ ప్రముఖ సంగీత దర్శకుడిగా దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని రాణిస్తున్నారు. ధనుష్ నటించిన ‘3’ సినిమాని ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ ఆ తర్వాత తెలుగు, తమిళంలో అనేక సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
కనుక క్రికెట్, మీడియా వ్యాపార రంగాల్లో గుర్తింపు పొందిన కావ్యా మారన్, సంగీత ప్రపంచంలో విజయవంతమైన అనిరుధ్ వివాహం గురించి అటు క్రికెట్, మీడియా రంగంలో, ఇటు సినీ పరిశ్రమ ఆసక్తికరమైన వార్తగా నిలుస్తోంది. నవంబర్లో వివాహం అనుకుంటున్నారు కనుక త్వరలోనే వీరి వివాహానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.