తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అద్దం పట్టే బతుకమ్మ పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మ వేడుకలను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో మహిళా పోలీసులు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీమతి బి.సుమతి, IPS గారితో సహా మహిళా పోలీసులందరూ సంప్రాదాయబద్దంగా చీరలు ధరించి పూలతో బతుకమ్మలను పేర్చారు. ఆ తర్వాత అందరూ కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే ఈ సందర్భంగా కమిషనర్ గారు మహిళా పోలీసు సిబ్బందితో పాటు తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తరఫున తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు!