అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్. కళ్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా నటిస్తున్న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
తలపాగా చుట్టుకొని కళ్ళకు కూలింగ్ గ్లాసస్, చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకొని పొలంలో ట్రాక్టర్ నడుపుతున్న పోస్టర్ చాలా బాగుంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. కనుక త్వరలోనే ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ పోస్టర్లు వరుసగా విడుదల కానున్నాయి. సబ్ టైటిల్ ‘బావ బామర్ది సౌజన్యంతో’ అని పెట్టారు కనుక వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బామర్ది అని చెప్పేసినట్లే. ఆ లెక్కన కీర్తి సురేష్, కృతిశెట్టిల వరుసలు కూడా కలిసినట్లే.
అనిల్ రావిపూడి ఈ నలుగురితో ఈసారి ఎలాంటి కామెడీ పండించబోతున్నారో తెలియాలంటే ‘జనవరి 12న ‘జనవరి 12విడుదలయినప్పుడు తెలుస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.