సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చేస్తున్న ‘భోగి’ సినిమా నుంచి అన్నయ్య పాణం అంటూ సాగే చక్కటి లిరికల్ వీడియో సాంగ్ దసరా పండుగ రోజున విడుదలైంది. ఈ సినిమాలో హీరో శర్వాకు ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారు. ఓ పచ్చటి పల్లెల్లో నివసిస్తున్న వారి మద్య అనుబంధాలను ఈ పాటలో చూపారు.
అన్నయ్య పాణంలో అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ అద్బుతమైన సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో అద్భుతంగా స్వరపరిచి సంగీతం అందించారు. ఈ పాటను శ్రీకృష్ణ చక్కగా ఆలపించగా, ఎ కిషోర్ కుమార్ తన కెమెరా పనితనంతో అద్భుతంగా చూపారు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూరగాయలు అమ్ముకునే కందుల సులోచనా రాణిగా నటిస్తున్నారు. డింపుల్ హయతి, అవినాష్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 12న విడుదల కాబోతోంది.