బుచ్చిబాబు పరిస్థితి ఏమిటో?

June 28, 2026


img

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పెద్ది’పై విడుదలకు ముందు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు, టీజర్లు, పాటలు, అలాగే రామ్ చరణ్ కొత్త లుక్ వగైరాలన్నీ చూసినప్పుడు ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందనే అందరూ అనుకున్నారు. రంగస్థలం తర్వాత ఆ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్నారు. కనీసం వెయ్యి కోట్లు అవలీలగా సాధిస్తుందని అనుకున్నారు. 

అయితే పెద్దిలో రామ్‌ చరణ్‌ విశ్వరూపం చూపించి ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సినిమా మాత్రం నూటికి నూరు మార్కులు సాధించలేకపోయింది. ముఖ్యంగా కథనం, స్క్రీన్‌ప్లే, హీరోయిన్ అందాల ప్రదర్శన, ఐటెం సాంగ్‌ వంటివి పెద్దిని దెబ్బ తీశాయని రివ్యూలు వచ్చాయి. ఈ టాక్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపింది. 

కనుక ఇంత హైప్‌ సృష్టించడం వల్లనే పెద్దిపై అంచానాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలు అందుకోలేనప్పుడు ముందుగా అందరూ దర్శకుడు బుచ్చిబాబు సనానే నిందించారు. అట్టర్ ఫ్లాప్ ‘గేమ్‌ చేంజర్’ దెబ్బనే తట్టుకొన్న రామ్‌ చరణ్‌కి పరవాలేదనిపించుకున్న ‘పెద్ది’ దెబ్బని తట్టుకొని ముందుకు సాగడం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు పరిస్థితి ఏమిటి? 

ఆయన కథ నమ్మి ఏ హీరో సినిమా ముందుకు వస్తాడు? లేదా ఏ హీరోతో అయన తర్వాత సినిమా చేయబోతున్నారు? ఎప్పుడు? అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి బుచ్చిబాబే సమాధానం చెప్పాలి. చెప్తారు. 


Related Post

సినిమా స‌మీక్ష