భారత్‌ ఖాతాలో తొలి రజత పతకం!

August 09, 2024
img

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజత పతకం లభించింది. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా భారత్‌కు పతకం సంపాదించిపెట్టాడు. నిన్న జరిగిన ఫైనల్స్‌లో పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 92 మీటర్లు బల్లెం విసిరి తమ దేశానికి తొలి స్వర్ణం సాధించి పెట్టగా, నీరజ్ చోప్రా 89.45 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. 

అయితే క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ చోప్రా 89.34 మీటర్లు విసరగా, పాక్ ఆటగాడు అర్షాద్ 86.59 మీటర్లకే పరిమితం అయ్యాడు, కానీ ఫైనల్స్‌లో పాక్ ఆటగాడు నీరజ్ చోప్రా కంటే మెరుగైన ప్రదర్శన చేసి స్వర్ణ పతకం గెలుచుకోవడం విశేషం. 

రజత పతకం గెలుచుకున్నందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకి అభినందనలు తెలియజేస్తున్నాయి. అయితే అతను మాత్రం ఫైనల్స్‌లో వెనుకబడిపోయినందుకు బాధ పడుతున్నాడు. భారత్‌కు పతకం సాధించడం సంతోషంగా నే ఉంది కానీ నా ప్రదర్శనని మరింత మెరుగు పరుచుకోవలసి ఉండ్ని భావిస్తున్నాను. భారత్‌ తిరిగి వచ్చాక దీనిపై కూర్చొని మాట్లాడుకుందాము,” అని అన్నారు. 

అయితే యావత్ దేశ ప్రజలు నీరజ్ చోప్రా భారత్‌కు రజత పతకం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నారు. అతని తాత ధరమ్ సింగ్‌ చోప్రా, తల్లి తండ్రులు సతీష్ చోప్రా, సరోజ్ దేవి ఇద్దరూ తమ కుమారుడు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించినందుకు ఆనందంతో పొంగిపోతున్నారు.  

Related Post