అందరూ రేటింగ్ ఇచ్చేవారే: బన్నీ వాసు

October 16, 2025


img

ప్రియదర్శి విష్ణు తదితరులు నటించిన ‘మిత్రమండలి’ సినిమా ఈరోజు విడుదల కాబోతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా వేశారు. 

ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, “సినీ జర్నలిస్టులు సినిమాలపై ఎలాగూ రివ్యూలు వ్రాస్తుంటారు. రేటింగ్స్ ఇస్తుంటారు. కానీ ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్మకాలు జరిపే ‘బుక్ మై షో’ యాప్‌లో కూడా సినిమాలకు రేటింగ్స్ ఎందుకు పెడుతోంది? అది కేవలం సినిమా టికెట్స్ బుకింగ్‌కి పరిమితం కాకుండా రేటింగ్స్ పెడుతుంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు దెబ్బ తింటాయి కదా?

సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు చూసి నిర్ణయించుకుంటారు. మద్యలో ప్రతీ ఒక్కరూ రివ్యూలు, రేటింగ్స్ ఇస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా అడ్డుకుంటే మేము ఎలాగూ నష్టపోతాము. సినిమాలపైనే బ్రతికే మీరు కూడా నష్టపోతారని మరిచిపోవద్దు,” అని బన్నీ వాసు ఘాటుగా హెచ్చరించారు.


Related Post

సినిమా స‌మీక్ష