విజయ్ సేతుపతి-పూరీ సినిమాకి హర్షవర్ధన్ సంగీతం!

October 15, 2025


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేయబోతున్న సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్‌ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారు. పూరీ-ఛార్మీ, హర్షవర్ధన్‌తో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయం తెలియజేశారు. 

సందీప్ రెడ్డి వంగా సినిమాకు సంగీతం అందించి జాతీయ అవార్డు అందుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్, ప్రస్తుతం ప్రభాస్-నీల్ సినిమా ‘స్పిరిట్’కి సంగీతం అందిస్తున్నారు. అయన ఇప్పుడు పూరీ టీమ్‌లో చేరడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. 

ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, సీనియర్ నటులు టబు, రాధిక ఆప్టే ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమా టైటిల్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు దేనినీ ఖరారు చేయలేదు.


Related Post

సినిమా స‌మీక్ష