బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమాలో హీరో హీరోయిన్లపై ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుగుతోంది.
ఈ పాట చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ ఓ లోయ పక్కన కొండపై బండరాయిపై నిలబడి పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మపై ఓ కాలు పెట్టి డాన్స్ చేస్తున్నప్పుడు తీసిన చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
అయితే ఆ డాన్స్ చేస్తున్నది రామ్ చరణా కాదా అనేది స్పష్టంగా లేదు. కానీ కెమెరా టీమ్ ఆ డాన్స్ షూట్ చేస్తునందున రామ్ చరణే అయ్యుండవచ్చు.
ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ క్రీడాకారుడుగా నటిస్తుంటే, ఆయన కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. రామ్ చరణ్ తల్లిగా ప్రముఖ తమిళ్, కన్నడ నటి విజి చంద్రశేఖర్ నటిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు మరో చరిత్ర, ఇది కధ కాదు, గుప్పెడు మనసు, కోకిల వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి సరిత సోదరే వీజీ చంద్రశేఖర్. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.