జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా చేసిన ‘కె-ర్యాంప్’ టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దానిలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు చూస్తే మామూలు ప్రేక్షకులు ఎవరూ తట్టుకోలేరనిపిస్తుంది.
టీజరే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్, తర్వాత సినిమా ఎలా ఉంటాయో?అనిపించక మానదు. కానీ నిన్న విడుదల చేసిన ట్రైలర్ చాలా నీట్‌గా చక్కటి కామెడీతో హాయిగా నవ్వుకునేలా ఉంది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, సాయి కుమార్, అలీ, మురళీధర్ గౌడ్, చంద్రిక, రవి, విమలా రామన్, మెర్సీ జాయ్, కామ్నా జట్మలానీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేశారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కాబోతోంది.