కోలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన ‘బైసన్’ ట్రైలర్ విడుదలైంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో ధృవ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించారు.
ట్రైలర్ ప్రకారం ఇది 1990 నాటి కధ. కబాడీ ఆట నేపధ్యంతో రాజకీయాలు, సామాజిక సమస్యలతో ముడిపెట్టి తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. బైసన్‌లో పశుపతి, ఆమీర్, లాల్, రాజీషా విజయన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు పాటలు, సంగీతం: మారి సెల్వరాజ్, ఆరివు; కెమెరా: ఎజిల్ అరసు కె; ఎడిటింగ్: శక్తి తిరు; యాక్షన్ కొరియోగ్రఫీ : ధిలీప్ సుబ్బరాయన్; డాన్స్ కొరియోగ్రఫీ : సాండీ; యాక్షన్ కోరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్ చేశారు.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పి.ఏ. రంజిత్, అదితి ఆనంద్ కలిసి నిర్మిస్తున్న బైసన్ (తెలుగు) ఈ నెల 24న విడుదల కాబోతోంది.