టైటిల్‌ ఫౌజీ.. ప్రదీప్ రంగనాథ్ కూడా చెప్పారుగా

October 14, 2025


img

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న సినిమా పేరు ‘ఫౌజీ’ అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా ధృవీకరించలేదు. కానీ అభిమానులు దానికే ఫిక్స్ అయిపోయారు. కోలీవుడ్‌లో నటుడుగా మారిన సంగీత దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ కూడా ప్రభాస్ సినిమా పేరు ఫౌజీ అని చెప్పేశారు.

అయన నటించిన ‘డూడ్‌’ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు చెప్పచ్చో లేదో అంటూనే ప్రభాస్ సినిమా టైటిల్‌ ‘ఫౌజీ’ అని చెప్పేశారు. కనుక ఈ సినిమాకు ఇదే టైటిల్‌ ఖరారు చేసినట్లు భావించవచ్చు.    

కొత్త హీరోయిన్‌ ఇమాన్వీ ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నట్లు సమాచారం..   

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష