మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీఎల్ చైర్మ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీరేందర్ సచ్ దేవాలతో కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రధాని మోడీని కలిశారు.
భారతీయ వారసత్వ క్రీడలలో విలువిద్య ఎప్పటి నుంచో ఉంది. కనుక ఆర్చరీలో యువతకు శిక్షణ ఇస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో దేశానికి పతకాలు సాధించడానికి ఏపీఎల్ చేస్తున్న కృషిని వారు ప్రధాని మోడీకి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్చరీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వారు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు ప్రధాని మోడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమని కానుకగా అందజేశారు.