రిజర్వేషన్స్‌: సుప్రీంకోర్టు కూడా అదే చెప్పబోతోందా?

October 14, 2025


img

బీసీ రిజర్వేషన్స్‌ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో నేడు స్పెషల్ లీవ్ పిటిషన్‌ వేసింది. బీసీ రిజర్వేషన్స్‌ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నేడు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌లో లిస్టింగ్ అయ్యింది కనుక రెండు మూడు రోజులలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే బీసీ రిజర్వేషన్స్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. కనుక వాటన్నిటిపై ఒకేసారి విచారణ చేపట్టవచ్చు.

అయితే ఈ కేసులలో పిటిషనర్లు సూచించిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం. వారు కౌంటర్లు దాఖలు చేయడం, ఇరు పక్షాల వాదనలు వినడం, వాటిపై సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదనే భావించవచ్చు. 

కానీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు తీర్పు రాజ్యాంగం, సుప్రీంకోర్టు పాత తీర్పులకు అనుగుణంగానే ఉంది కనుక దాంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు కూడా పాత రిజర్వేషన్స్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కానీ బీసీ రిజర్వేషన్స్‌కు అంగీకరించకపోవచ్చు. ప్రభుత్వ పిటిషన్‌పై ఎలాగూ సుప్రీంకోర్టు రెండు మూడు రోజులలో విచారణ చేపట్టబోతోంది కనుక అప్పుడే దీనిపై స్పష్టత వస్తుంది.


Related Post