పారితోషికంలో కూడా తగ్గేదేలే!

October 12, 2025


img

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ అత్యధికంగా రూ.120 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. సుకుమార్-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-1 సూపర్ డూపర్ హిట్ అవడంతో పుష్ప-2 కోసం అల్లు అర్జున్‌ రూ.176 కోట్లు పారితోషికం పొందారని దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వయంగా ఇన్‌సైడ్ టాక్‌గా ఇదివరకు చెప్పారు.

పుష్ప-1,2 రెండు సినిమాలే సుమారు రూ.2,500 కోట్లుపైన కలెక్షన్స్ సాధింఛి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులకు కనకవర్షం కురిపించాయి. 

పుష్పరాజ్‌ ఇప్పుడు ఇంటర్నేషనల్ కనుక కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీతో తీస్తున్న పాన్ వరల్డ్ సినిమాకి అల్లు అర్జున్‌ రూ.180 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ పుష్ప-2 తర్వాత  200 కోట్లకి పారితోషికం పెంచేస్తారనుకుంటే రూ.180 కోట్లతో సరిపెట్టుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సినిమా కలక్షన్స్ విషయంలోనే కాదు పారితోషికంలో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు అల్లు అర్జున్‌. 

అల్లు- అట్లీ కాంబినేషన్‌లో తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ బడ్జెట్‌ రూ. 750-1,0000 కోట్లు మద్యలో ఉంటే దానిలో అల్లు అర్జున్‌ పారితోషికానికి రూ.180 కోట్లు, హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ సీనియర్ నటి దీపికా పడుకొనేకి సుమారు రూ.60-70 కోట్లు, గ్రాఫిక్స్ కోసం మరో రూ.250 కోట్లు ఖర్చు చేయబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష