భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నటించిన మాస్ జాతర ఈ నెల 31న విడుదల కాబోతోంది. అలాగే నీరజ్ కోనా దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటించిన తెలుసు కదా? కూడా ఈ నెల 17న విడుదల కాబోతోంది.
కనుక ఈ రెండు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, సిద్ధూ జొన్నలగడ్డ సరదాగా తమ సినిమాలు, సాటి నటీనటులు, అభిమానులు, షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుకున్న వీడియోని సితారాఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసింది. వారు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వారేమన్నారో వారి మాటల్లోనే వింటే బాగుంటుంది.