సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో చేసిన ‘తెలుసు కదా?’ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. నేడు ట్రైలర్ కూడా విడుదలకాబోతోంది.
ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇది కేవలం ప్రేమ కధ కాదు. ప్రస్తుతం సమాజంలో సాగుతున్న ప్రేమలు, ప్రతీకారాలను ఈ సినిమాలో హీరో, ఇద్దరు హీరోయిన్ల మద్య చూపించబోతున్నారట. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఈ సినిమాలో హర్ష చెముడు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నీరజ్ కోనా సంగీతం: తమన్, కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?