ఈసారి దీపావళికి నాలుగు సినిమాలతో పండగే

October 14, 2025


img

తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి పండుగ సీజన్ తర్వాత అంత కీలకమైనది దసరా-దీపావళి పండగల సీజన్. ఈసారి దసరాకు ముందు మిరాయ్, తర్వాత కాంతారా ఛాప్టర్: 1 శుభారంభం చేశాయి. వాటి తర్వాత దీపావళి పండగకు నాలుగు సినిమాలు వరుసగా రాబోతున్నాయి.

ఈ నెల 16న ప్రియదర్శి తదితరులు చేసిన ‘మిత్రమండలి’, 17న సిద్ధూ జొన్నలగడ్డ చేసిన ‘తెలుసు కదా’ 18న కోలీవుడ్‌ నటుడు ప్రదీప్ రంగనాథ్ చేసిన ‘డూడ్‌’ , 18న కిరణ్ అబ్బవరం చేసిన ‘కే ర్యాంప్’ వరుసగా విడుదల కాబోతున్నాయి.

ఈ నాలుగు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో ఒకేసారి మూడు కామెడీ సినిమాలు వరుసగా విడుదలవుతుండటం విశేషం. వీటిలో ‘మిత్ర మండలి’ని ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్‌ 15న ప్రీమియర్ షోలు వేయబోతున్నామని నిర్మాత బన్నీ వ్యాస్ చెప్పారు. 

కనుక ఈసారి దీపావళి పండగకు 5 రోజుల ముందుగానే సినీ అభిమానులకు పండగ హడావుడి మొదలైపోతుంది.   రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఈసారి పండగకి ప్రేక్షకులతో కళకళలాడబోతున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష