ఆంధ్రా కింగ్‌ తాలూకా… ఓ వీరాభిమాని టీజర్‌

October 13, 2025


img

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా చేసిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ టీజర్‌ ఆదివారం ఉదయం విడుదలైంది.   

మహేష్ బాపు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా “ఓ అభిమాని బయోపిక్”... 1970-80 లలో హీరోల అభిమానులు ఏవిదంగా ఉండేవారో చూపబోతున్నారు. టీజర్‌లో అదే చూపారు.   

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఈ సినిమాలో సినీ హీరోగా నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు.  

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.    

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/hO_4evsVmBM?si=1YVJ4i1uOBCxgupL" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష