మోహన్ బాబు ప్యారడైజ్‌ని మార్చేస్తారేమో?

September 28, 2025
img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్‌’లో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇదివరకు నానిని రెండు జడలతో ‘జడల్’ అని పరిచయం చేసినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

నిన్న మోహన్ బాబు పోస్టర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూసినప్పుడు ఈ సినిమాని నాని వలన నడుస్తుందా లేక మోహన్ బాబు విలనిజంతో నడుస్తుందా? అనే టాక్ వినిపిస్తోంది.

ఈరోజు ఈ సినిమా నుంచి మోహన్ బాబు పోస్టర్‌ మరొకటి విడుదల చేశారు. అయితే నిన్న విడుదల చేసిన పోస్టర్‌తో పోలిస్తే ఇది అంత గొప్పగా లేదు... రోటీన్‌గానే ఉందని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ, ఈ సినిమాలో విలన్‌ ‘శికంజ మాలిక్’గా మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారనిపిస్తుంది. 

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతోంది. 

Related Post