హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు... తగ్గేదేలే!

October 15, 2025
img

పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎంతమందిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నా హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం రాత్రిహద్ శివారులో మహేశ్వరం మండలంలో గల కే. చంద్రారెడ్డి రిసార్టులో  రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

రాక్ స్టార్ ఫెర్టిలైజర్ కంపెనీ యజమాని సైదారేద్ది, వేద అగ్రి ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ తిరుపతి రెడ్డి, ఫెర్టిలైజర్ కంపెనీల యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగింది. దీనిలో 59 మంది ఫెర్టిలైజర్ కంపెనీల యజమానులు పాల్గొనగా, వారిని అలరించేందుకు 20 మంది మహిళలను రప్పించారు.

వారు అర్ధ నగ్నంగా నృత్యం చేస్తుండగా పురుషులు విదేశీ మద్యం తాగుతూ చిందులు వేశారు. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు అందించిన సమాచారంతో మహేశ్వరం పోలీసులు కలిసి దాడి చేసి వారి రేవ్ పార్టీని భగ్నం చేశారు. పార్టీలో పాల్గొన్నవారిపై కేసులు నమోదు చేసి విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

Related Post